Header Banner

ఓటీటీలోకి రానున్న డ్రాగన్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.!

  Mon Mar 10, 2025 19:54        Entertainment

ప్రదీప్ రంగనాథన్, కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 35 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇంతవరకూ ఈ సినిమా 120 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమా ఇంకా తన జోరు చూపుతోందని అంటున్నారు. ఈ కారణంగానే, ముందుగా ఈ నెల 21వ తేదీన స్ట్రీమింగ్ చేయాలనుకున్న నెట్ ఫ్లిక్స్, ఈ నెల 28కి వాయిదా వేసుకున్నట్టుగా చెబుతున్నారు. కథగా చెప్పుకోవాలంటే.. హీరో ఒక కాలేజ్ లో ఇంటర్ చదువుతూ ఉంటాడు. అప్పటి నుంచే అతను లవ్ లో పడతాడు. ఫలితంగా ఆయన చదువు దెబ్బతింటుంది. తిరిగి అతను దార్లోపడటానికి చాలా సమయం పడుతుంది. ఆ తరువాత అతను లైఫ్ లో సక్సెస్ అవుతాడు. గతంలో అతని లైఫ్ నుంచి తప్పుకున్న వారు ఆ సమయంలో ఏంట్రీ ఇస్తారు. అప్పుడు ఏం జరిగింది అనేది కథ. 

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #DragonPradeep #RanganathAnupama #Parameshwaran #KayaduLohar